తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో హాట్ హాట్ గా మారాయి.ప్రస్తుతం చాలా వరకు బీజేపీ నేతలు టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీపై ఒక్కసారిగా ప్రజల చూపు పడింది.
అయితే బండి సంజయ్ అరెస్ట్ తరువాత బీజేపీ కీలక నేతలు తెలంగాణకు క్యూ కడుతున్న విషయం తెలిసిందే.
అయితే ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ అయిన తరువాత బీజేపీకి పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతుందని భావించినా అంతగా మద్దతు దొరకక పోవడంతో ఇక జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు రావడం ద్వారా జాతీయ మీడియాను ఆకర్షించవచ్చు, అలాగే రాష్ట్ర మీడియా కూడా ఫోకస్ చేయడం ద్వారా రాజకీయ వేడి అనేది చల్లారకుండా సరికొత్త మార్పులు జరుగుతూ ప్రజల్లో చర్చ మాత్రం జరుగుతూ వస్తోంది.
అయితే ఇంకా రానున్న రోజుల్లో మరి కొంత మంది జాతీయ నేతలు కూడా తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల పట్ల కేసీఆర్ బహిరంగంగా ఏమాత్రం స్పందించకున్నా తెర వెనుక వ్యవహారం నడిపిస్తూ సరికొత్త రాజకీయానికి తెర దీస్తున్న పరిస్థితి ఉంది.బీజేపీ నేతల పర్యటనలతో బీజేపీపై పెద్ద ఎత్తున రాజకీయంగా దృష్టి పడటం ద్వారా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇదే అదునుగా పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి నేడు నెలకొంది.అందుకే బండి సంజయ్ అరెస్ట్ అంశాన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ గతంలో కంటే రెండింతలు ఎక్కువగా పటిష్టం చేయడం ద్వారా భవిష్యత్తులో చేసే పోరాటాల విషయంలో మరింతగా దూకుడు ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందనేది బీజేపీ వ్యూహంలా కనిపిస్తోంది.