తెలంగాణలో దూకుడు పెంచబోతున్న కేజ్రీవాల్... వ్యూహం ఫలించేనా?

తెలంగాణ రాజకీయం రోజు రోజుకు బలపడటానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పటి నుండే ఎన్నికల వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశ్యంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆప్ పార్టీ తెలంగాణ లో కీలకంగా చక్రం తిప్పడానికి సిద్ధమవుతుందన్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం రేగాయి.అయితే ఏప్రిల్ 14 నుండి ఆప్ తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే.

అయితే తెలంగాణలో బీజేపీకి ఆప్ రూపంలో పెద్ద ఎత్తున షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.అయితే రానున్న రోజుల్లో ఇటు బీజేపీ, కాంగ్రెస్ లకు ఆప్ పార్టీ రూపంలో కొంత రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంది.

అయితే ఆప్ రాజకీయ సిద్దాంతాలను ఇష్టపడే యువత కావచ్చు, ప్రజలు కావచ్చు తెలంగాణలో కూడా ఉన్న పరిస్థితుల్లో ఆప్ పార్టీకి ఒక్క సారిగా మద్దతు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఎందుకంటే కేజ్రీవాల్ ఢిల్లీలో అమలు చేస్తున్న ప్రవేశపెట్టిన పధకాలు కావచ్చు, పాలనా విధానం కావచ్చు ఢిల్లీ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా మనం చూశాం.

Advertisement

అయితే తెలంగాణలో ఆ తరహా పాలనను ఆహ్వానిస్తారా అంటే ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఇప్పుడు అంటే వచ్చే ఎన్నికల్లో కాకపోయినా మరల వచ్చే ఎన్నికల్లో అయినా ఎంతో కొంత కీలకమైన పార్టీగా ఆప్ ఎదిగే అవకాశం వందకు వంద శాతం ఉంది.

మరి రానున్న రోజుల్లో కేజ్రీవాల్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు