కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన పెంగ్విన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను థియేటర్లలో ప్రేక్షకులు చూడాలనుకున్నారు.
కాని థియేటర్లు మూసి ఉన్న కారణంగా ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
పెంగ్విన్ సినిమా టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై అంచనాలు ఆకాశానికి పెంచాయి.
కీర్తి సురేష్ తన కొడుకు కోసం చేసే పోరాటమే ఈ సినిమా.
ఈ సినిమాలో విలన్ జోకర్ మాస్క్‌లో ఉంటాడు.ఇప్పటి వరకు ఆ మాస్క్ వెనుక ఉన్నది ఎవరు అనే విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.
ఇక్కడ చెప్పుకోవల్సిన విషయం ఏంటీ అంటే ఈ సినిమాలో విలన్‌గా నటించింది ఎవరు అనేది ఒక్క దర్శకుడికి తప్ప మరెవ్వరికి తెలియదట.ఆయన ఇంటి నుండి వచ్చే సమయంలోనే మాస్క్ వేసుకోవడం మాస్క్ తియకుండానే షూటింగ్ చేయడం వెళ్లి పోవడం చేశాడట.
షూటింగ్ జరుగుతున్న అన్ని రోజులు కూడా యూనిట్ సభ్యులు ఆ విలన్ ఎవరై ఉంటారా అనే విషయాన్ని గెస్ చేసేందుకు ప్రయత్నించారట.కాని ఎవరు కూడా ఆ విలన్ ఎవరు అనే విషయాన్ని గుర్తించలేదు.ఇప్పటి వరకు కూడా యూనిట్ సభ్యులకు ఆ విలన్ ఎవరో తెలియదు.ప్రేక్షకులతో పాటు యూనిట్ సభ్యులు కూడా ఆ విలన్ ఎవరు అనే విషయాన్ని సినిమా చూసే తెలుసుకోవాల్సి ఉంది.
ఇలా ఇప్పటి వరకు ఏ సినిమా విషయంలో జరిగి ఉండదు కదా.!
.