ఈనెల 27న మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.

ఇందులో భాగంగా గులాబీ బాస్, సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈనెల 27న కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.శనగపురం రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు పార్టీ నేతలు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకు కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు