కెసిఆర్ - ట్రెండ్ క్రియేట్ చేసారు !

తెలంగాణ జల సమగ్ర విధానంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

తాజాగా, ఫారిన్ కరస్పాండెన్స్ క్లబ్ ఆఫ్ దక్షిణాసియా అధ్యక్షుడు వెంకటనారాయణ ప్రశంసిస్తూ ఈ మేరకు ఒక లేఖ రాశారు.

తాము నిర్వహించనున్న గ్లోబల్ మీడియా సమావేశంలో పాల్గొనాలంటూ ఆ లేఖలో కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.కాగా, ఇటీవల టీ-అసెంబ్లీలో జల సమగ్ర విధానంపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ ఏకధాటిగా మూడు గంటల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు.

ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మొత్తం మూడు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.దీంతో పాటు శాసనమండలి సభ్యుల కోసం మరో ఎల్ ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

నాగచైతన్య తండేల్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ మ్యాజిక్ రిపీట్ కావడం పక్కా!
Advertisement

తాజా వార్తలు