ఏపీ క్యాబినెట్ లోకి లోకేష్ ?

టీడీపీ అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్… ఇక కొత్త బాధ్యతల్లో కనిపించనున్నారు.ఇప్పటిదాకా పార్టీ కార్యకలాపాల్లో బిజీబిజీగా కనిపిస్తున్న లోకేశ్… మరో రెండు, మూడు నెలల్లో మంత్రిగా కనిపించనున్నారు.

 Lokesh Into Ap Cabinet-TeluguStop.com

పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ ను తన కేబినెట్ లోకి తీసుకునేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే దీనిని అమలులోకి తీసుకురానున్నారని ఓ తెలుగు దినపత్రిక ఆసక్తికర కథనాన్ని రాసింది.

ఇప్పటికే మిత్ర పక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో లోకేశ్ కు కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తే… అటు ఏపీకే కాక ఇటు తెలంగాణకు కూడా మేలు జరుగుతుందని టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.

అయితే తనయుడు భాగస్వామిగా ఉన్న కేంద్ర కేబినెట్ పై ఒత్తిడి తీసుకురావడం కుదరదన్న భావనతో ఈ ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube