కేసీఆర్ కి కాలుతోంది ! కారణం చంద్రబాబే

తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇప్పుడు ఓ వ్యవహారం అస్సలు నచ్చడం లేదు.

తెలంగాణాలో కనుమరుగయిపోయింది అనుకున్న టీడీపీ మళ్లీ మహా కూటమి సాయంతో పుంజుకోవడం ఒకటయితే.

ఏపీ పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాలను తెలంగాణాలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో రహస్యంగా దించడం కేసీఆర్ కి ఆందోళన పెంచుతోంది.అంతే కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏపీ ఇంటలిజెన్స్ సిబ్బంది రహస్యంగా ఆరా తీయడం కేసీఆర్ దృష్టికి చేరింది.

దీంతో అక్కడ పోలీసులకు ఇక్కడేం పని .? అంటూ కేసీఆర్ బాబు తీరుపై ఫైర్ అవుతున్నాడు.

ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేస్తే.తన పార్టీ భవిష్యత్తుకు ఎసరు తగులుతుందని అందుకే చంద్రబాబు వ్యవహారంపై గవర్నరన్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కేసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.తన పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపైనే కాకుండా మహా కూటమి అభ్యర్థుల విజయావకాశాలపై కూడా సర్వేలు చేయించేందుకు చంద్రబాబు ఎపి నిఘా, పోలీసు విభాగాల సిబ్బందిని దించినట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తూ వస్తోంది.

Advertisement

అయితే ఈ వ్యవహారం పై టీడీపీ పెద్దగా స్పందిననూ లేదు.ఎపి పునర్వ్యస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని కేసిఆర్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై కేసిాఆర్ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించినట్లు సమాచారం.

హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అయినప్పటికీ మొత్తం పాలనా యంత్రాంగాన్ని అమరావతికి తరలించిన తర్వాత పోలీసులు, ఇంటిలిజెన్స్ సిబ్బందిని తెలంగాణలో దించడం చంద్రబాబు కి తగదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ అధికారులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సర్వేలు చేస్తున్నారని ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల టీఆర్ఎస్ నాయకులు కేసిఆర్ దృష్టికి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి.టీఆర్ఎస్ అసమ్మతి నేతలను లాక్కునేందుకు కూడా ఇంటిలిజెన్స్ వర్గాలను చంద్రబాబు వాడుకుంటున్నారని టీఆర్ఎస్ అగ్ర నాయకులూ అనుమానిస్తున్నారు.అందుకే బాబు దూకుడికి కళ్లెం వేసేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు