KCR Arvind Kejriwal : సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన కేసీఆర్..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని( CM Arvind Kejriwal ) ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.

దీంతో దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసనలు తెలియజేస్తున్నారు.

ఈనెల 26న మోదీ ఇంటి ముట్టడికి ఆప్ నేతలు పిలుపునివ్వడం కూడా జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్( KCR ) స్పందించారు.

"ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు.

Kcr Reacts To Cm Arvind Kejriwal Arrest

ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ( BJP ) వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయి.ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటున్న‌ది.ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను భారత రాష్ట్ర స‌మితి( BRS ) తీవ్రంగా ఖండిస్తున్న‌ది.

Advertisement
Kcr Reacts To Cm Arvind Kejriwal Arrest-KCR Arvind Kejriwal : సీఎం అ�

కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్.అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం".

అని సోషల్ మీడియాలో కేసిఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు