బీఆర్ఎస్ తొలి సభ అమరావతిలో ..?

బీఆర్ఎస్ పేరుతో కొత్త జాతీయ పార్టీని ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలన సృష్టించారు తెలంగాణ సీఎం కేసీఆర్.

ఈ జాతీయ పార్టీ ద్వారా విస్తృతంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి,  రాబోయే ఎన్నికల్లో తమ సత్త చాటుకోవాలని లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు.

బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో ముందుకు వెళ్లబోతున్నారు.తమకు కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లి బిజెపి తో తలపడేందుకు సిద్ధమవుతున్నారు.

నిన్ననే ఘనంగా బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది.బీఆర్ఎస్ ను జనాల్లోకి తీసుకెళ్లే విధంగా తొలి సభను భారీగా నిర్వహించేందుకు కేసఆర్ కసరత్తు మొదలుపెట్టారు.

దీనిలో భాగంగానే మొదటి సభను రామ్ లీలా మైదానంలో నిర్వహిస్తారనే ప్రచారం జరిగినా,  కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారట.మహారాష్ట్రలోని అమరావతి వేదికగా తొలి సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

దేశంలో వ్యవసాయ రంగంపై 40 శాతం మంది జీవనం సాగిస్తూ ఉండడంతో,  రైతు సమస్యలే అజెండాగా ముందుకు వెళ్తామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు.ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తానని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు.

దీనిలో భాగంగా రైతు సంఘాల నేతలతో ఇప్పటికే అనేకసార్లు చర్చలు జరిపారు.మహారాష్ట్రకు చెందిన కిసాన్ సంఘ్ నేతలతో సైతం చర్చించారట.

దీనిలో భాగంగానే రైతు సభ పేరిట అమరావతిలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కెసిఆర్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

త్వరలోనే మరోసారి కిసాన్ సంఘ్ నేతలతో పాటు , అన్ని రైతు సంఘాలతో చర్చించి త్వరలోనే ఒక తేదీని ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నారట.ఇక ఈ సభను మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు కారణాలు ఉన్నాయట.ప్రతి సంవత్సరం మహారాష్ట్రలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నట్లుగా ఎన్సిఆర్బి నివేదిక వెల్లడించింది  2020లో 4,006 ఆత్మహత్యలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి విదర్భ ప్రాంతంలో 331, యావత్ మల్ జిల్లాలో 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, మరట్వాడ ప్రాంతంలో 805 మంది రైతులు చనిపోయినట్లు సమాచారం.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఇవన్నీ పరిగణలోకి తీసుకునే కేసీఆర్ బీఆర్ఎస్ తొలి సభను మహారాష్ట్రలో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు