టీఆర్ఎస్ ను సమూల ప్రక్షాళన చేసే దిశగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పూర్తిగా టిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకుండా వ్యవహరించే నాయకుల పై ఎటువంటి మొహమాటం లేకుండా వేటు వేయాలనే దిశగా కెసిఆర్ వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.
సుదీర్ఘ కాలం తన వెంట నడిచిన ఈటెల రాజేందర్ పైన వేటు వేసేందుకు వెనుకాడని కేసీఆర్ ఇప్పుడు ఆ తరహా నాయకులందరినీ గుర్తించే పనిలో ఉన్నారు.పార్టీ కీలక నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులలో ఎవరెవరు టిఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనే విషయాన్ని కెసిఆర్ నిఘా వర్గాల ద్వారా తెప్పించుకుంటున్నారు.
టిఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి పని చేస్తూ, తాము కెసిఆర్ స్థాయి నాయకులు గా ఫీల్ అవుతున్న నాయకులను సాగనంపే ప్రక్రియకు కేసీఆర్ శ్రీకారం చుట్టారట.మొదటి నుంచి టిఆర్ఎస్ తో అనుబంధం పెంచుకున్న వారందరినీ పక్కన పెడుతూ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని విమర్శలు కెసిఆర్ పై ఉన్నాయి.

తన కుమారుడు కేటీఆర్ ను సీయం చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందునుంచే పార్టీలో సీనియర్ నాయకులను, అసంతృప్తులను బయటకు పంపడం ద్వారా కేటీఆర్ రాజకీయ పెరుగుదలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కేసీఆర్ అభిప్రాయంగా కనిపిస్తోంది.ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని చూస్తున్న కెసిఆర్ అర్జెంటుగా ఓ మంత్రి పై వేటు వేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామందికి రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించే అవకాశం లేనట్లు సమాచారం.త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో పూర్తిగా కేటీఆర్ కు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే అవకాశం ఇచ్చి , కేటిఆర్ ను డామినేట్ చేసే వారికి ప్రాధాన్యత తగ్గించడమో, లేక మంత్రి పదవి నుంచి తప్పించడమో చేయాలి అనే ఆలోచన చేస్తున్నారనే సమాచారం టీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.