వైసీపీలోకి మరో కీలక నేత..???

ఏపీలో రాజకీయాలు వన్ సైడ్ అయ్యిపోతాయేమో అనేట్టుగా ఉంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి.అందరి కీలక నేతల చూపు వైసీపీ పైనే ఉంది.

ఒక్కొక్కరుగా తాము ఉంటున్న పార్టీలని వదిలి పెట్టి మరీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోతున్నారు.నిన్నటివరకూ కూడా తెలుగుదేశం పార్టీలో కీలక ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుంటే.

ఇప్పుడు తాజాగా మరొక కీలక నేత, మాజీ ఎంపీ , బీజేపీ నేత అయిన కావూరి సాంబశివరావు వైసీపీలో చేరటానికి రంగం సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పుడు ఈవార్త రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.

ఆ వివరాలలోకి వెళ్తే.

Advertisement

దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కీలక వ్యక్తిగా , సీనియర్ మోస్ట్ రాజకీయ నేతగా , అత్యంత బలమైన వర్గం , కోటరీ కలిగి ఉన్న నేతగా కావూరికి మాంచి పేరు ఉంది.కేంద్ర మాజీ మంత్రి గా కూడా పని చేసిన కావూరి తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గం అయిన ఏలూరు లో మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా బలమైన కోటరీ ఉండటమే ఆయనకి ఉన్న ఏకైక బలం.అదే ఎప్పటికి కావూరిని తిరుగులేని నేతగా నిలబెడుతూ వచ్చింది.అయితే ఇప్పుడు కావూరి బీజేపీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి దాదాపు సర్వం సిద్దం చేసుకున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

రానున్న రెండు మూడు రోజుల్లోనే ఆయన జగన్ ని కలిసి తన అభిప్రాయాన్ని తెలిపి చర్చించిన తరువాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది.పశ్చిమ గోదావరి జిల్లాలోనే సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న కావూరి రాక వల్ల వైసీపీకి జిల్లాలో మరింతగా బలం పెరుగుతుందని జగన్ కూడా అభిప్రాయ పడుతున్నాడట.

అన్త్కెఆదు కావూరితో పాటుగా ఆయన అనుచరులు సైతం పార్టీలోకి వెళ్తున్నాట్టుగా తెలుస్తోంది.ఇదిలా ఉండగా కావూరితో జగన్ తరఫున ప్రశాంత్ కిషోర్ చర్చలు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నా సరే కావూరి ఈ విషయాన్ని ఖండిచిక పోవడం మరిన్ని అనుమానాలకి తావిస్తోంది.ఇదిలాఉంటే కావూరికి కి వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా అవకాశం ఇవ్వడానికి జగన్ సిద్దం అయ్యారని కూడా టాక్ వినిపిస్తోంది.ఆయన గతంలో ఇదే సీటు నుంచి అనేక సార్లు గెలుపొందటంతో పాటు ఎంతో మంది అనుయాయులని పొంది ఉండటంతో ఆ స్థానం ఖరారు చేయడానికి జగన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఇదే గనుక జరిగితే ఏలూరు ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోవడం పక్కా అంటున్నారు రాజకీయ పండితులు.

Advertisement

తాజా వార్తలు