భవిష్యత్తుపై ఆందోళనలో కౌశిక్ రెడ్డి... కాంగ్రెస్ పై నమ్మకం లేకనేనా?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టం.శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనే వారు ఉండరనే విషయం మనకు తెలిసిందే.

అయితే హుజూరాబాద్ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈటెల ప్రత్యర్తిగా కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి ప్రతి ఎన్నికలో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

ఈటెలపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ముందుకెళ్లే కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఈటెల భూ కబ్జాల అంశం బయటికి రావడంతో ఇక ఈటెలపై లైవ్ డిబేట్ లలో వెళ్లి సైతం ఈటెలపై విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా భర్తరఫ్ అనంతరం భట్టితో ఈటెల భేటీ కావడం, ఈటెలకు మద్దతుగా రేవంత్ వ్యాఖ్యానించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.

  అయితే కాంగ్రెస్ నేతలందరు ఈటెలకు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్ నేత అయిన కౌశిక్ రెడ్డి మాత్రం ఈటెలను విమర్శిస్తుండటంతో కాంగ్రెస్ నేతలు చెప్పినా కౌశిక్ రెడ్డి ఈటెల పై విమర్శలు చేయడంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అధిష్టానానికి లేఖ రాయడంతో ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి అవాక్కయ్యారనే చెప్పవచ్చు.ఇప్పటి వరకు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈటెల ఎంట్రీతో స్వరం మార్చడంతో కౌశిక్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

తాజా వార్తలు