రాముడు కాదు కర్ణుడిలా కనిపిస్తున్నాడు.. ఆదిపురుష్ పోస్టర్ పై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

ఈ మధ్య కాలంలో ఏ సినిమా చిక్కుకోని స్థాయిలో ఆదిపురుష్( Adipurush ) మూవీ వివాదాల్లో చిక్కుకుంది.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ లోని పాత్రల లుక్స్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

గ్రాఫిక్స్ కు సంబంధించిన కొన్ని షాట్స్ విషయంలో కూడా నెగిటివ్ కామెంట్లు వ్యక్తం కావడం ఫ్యాన్స్ ను బాధ పెట్టింది.అయితే కస్తూరి శంకర్ ఆదిపురుష్ పోస్టర్ల గురించి నెగిటివ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

రామలక్ష్మణులను మీసాలు, గడ్డాలతో చూపించే సాంప్రదాయం ఎక్కడైనా ఉందా? అని కస్తూరి శంకర్ ( Kasthuri Shankar )ప్రశ్నించారు.ఈ విధంగా కలవరపెట్టే మార్పులను ఎందుకు చూపించారని కస్తూరి శంకర్ ప్రశ్నించడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాలలో ఎందరో లెజెండ్స్ రాముని పాత్రను పూర్తిస్థాయిలో పరిపూర్ణతతో తెరపై చూపించడం జరిగిందని కస్తూరి శంకర్ వెల్లడించడం గమనార్హం.

Advertisement

ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ ను రాముడిలా కాకుండా కర్ణుడిలా చూపిస్తున్నారని కస్తూరి శంకర్ అన్నారు.కస్తూరి శంకర్ చేసిన కామెంట్లను కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.కస్తూరి శంకర్ ప్రస్తుతం పలు సీరియళ్లతో బిజీగా ఉన్నారు.

కస్తూరి శంకర్ బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తుండటం గమనార్హం.ప్రభాస్ ను రాముని పాత్రలో మీసాలు, గడ్డాలతో చూడటానికి మాకు ఇబ్బంది లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలో ప్రతిదీ వివాదం చేయడం ఫ్యాషన్ అయిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జూన్ నెల 16వ తేదీన పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.కొంతమంది నెటిజన్లు మాత్రం కస్తూరి శంకర్ కామెంట్లకు సపోర్ట్ చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఆదిపురుష్ మూవీ వరుస వివాదాల్లో చిక్కుకోవడం కొంతమంది ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు