నమ్మించి నన్ను మోసం చేశారు.. డాక్టర్ బాబు సంచలన వ్యాఖ్యలు?

కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసిన నిరుపమ్ పరిటాల చంద్రముఖి, కార్తీకదీపం సీరియల్స్ తో నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కార్తీకదీపం సీరియల్ ను అభిమానించే వాళ్లు ఉండటంతో ఈ సీరియల్ కు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి.

కార్తీకదీపం సీరియల్ ద్వారా నిరుపమ్ బుల్లితెర సూపర్ స్టార్ గా పేరును సంపాదించుకున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు తన కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

సినిమాకు టీవీకి గ్యాప్ ఉంటుందని స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు కూడా సీరియల్స్ చూస్తారని సీరియల్ ఆర్టిస్ట్ లు బిజీగా ఉంటారని భావించి అప్రోచ్ అవ్వరని అనుకుంటున్నానని నిరుపమ్ వెల్లడించారు.ఆ కారణం వల్లే సినిమా అవకాశాలు తక్కువగా వస్తుంటాయని నిరుపమ్ పేర్కొన్నారు.

సినిమాల్లో మంచి పాత్ర వస్తే చేస్తానని సీరియల్ ను ఆపుకుని సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశం మాత్రం లేదని నిరుపమ్ పేర్కొన్నారు.వెబ్ సెక్షన్ వైపు కూడా వెళ్లాలనే ఆలోచన తనకు ఉందని నిరుపమ్ అన్నారు.డాక్టర్ బాబు ఏడవటం గురించి చెబుతూ మగవాళ్లు ఏడిస్తే ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని తాను ఊహించలేదని తెలిపారు.

Advertisement

షూటింగ్ లో శౌర్య, హిమలను తాను ఏడిపిస్తానని చంద్రముఖి సీరియల్ తో జీవితం మొదలైందని ఆ సీరియల్ కు ఓకే చెప్పి మంచి పని చేశానని నిరుపమ్ అన్నారు.ఒక వ్యక్తి తనను కమర్షియల్ గా నమ్మించి మోసం చేశారని లైఫ్ లో ఒక్కసారి మోసపోయానని నిరుపమ్ చెప్పుకొచ్చారు.అయితే మోసం చేసిన వ్యక్తి పేరును బయటపెట్టడానికి మాత్రం నిరుపమ్ ఇష్టపడలేదు.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

తాజా వార్తలు