వీడియో: ఆడవాళ్లు స్నానం చేస్తుండగా వీడియో తీసిన వ్యక్తి.. చితకబాదిన స్థానికులు..

ఈ రోజుల్లో కామాంధులు బాగా రెచ్చిపోతున్నారు.సందు దొరికితే చాలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.

కొందరు సెల్ ఫోన్స్ చేత పట్టుకొని మహిళల ప్రైవేటు దృశ్యాలను రికార్డ్ చేస్తున్నారు.వాటిని చూసి లైంగిక ఆనందం పొందుతున్నారు.

మిగతావారు బ్లాక్ మెయిల్( Blackmail ) చేస్తూ పెద్దపెద్ద నేరాలకు పాల్పడుతున్నారు.తాజాగా కర్ణాటక రాష్ట్రం, హుబ్బల్లి జిల్లాలో( Hubbali ) ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడో దుర్మార్గుడు.

అయితే అప్పుడే అతడి పాపం పండింది.అతడు తన మొబైల్ ఫోన్ బాత్రూంలో( Bathroom ) ఉంచాడని సదరు మహిళా తెలుసుకోగలిగింది.

Advertisement

తర్వాత కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతడికి దేహశుద్ధి చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, గోకుల్ రోడ్ సమీపంలోని గణేష్ పేట్‌లో లాడ్ సాబ్( Laad Saab ) అనే వ్యక్తి నివసిస్తున్నాడు.ఈ యువకుడు లోహియా నగర్‌లోని ఓ భవన నిర్మాణంలో కార్మికుడిగా( Construction Worker ) వర్క్ చేస్తున్నాడు.అయితే ఆ భవన నిర్మాణం పక్కనే మరొక ఇల్లు ఉంది.

అందులో ఒక కుటుంబం నివసిస్తోంది.ఆ ఇల్లు బాత్ రూమ్ ఈ భవన నిర్మాణ ప్రవేశానికి కొద్దిగా అడుగుల దూరంలోనే ఉంది.

దాంతో సాబ్ లో ఒక దుర్బుద్ధి పుట్టింది.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

బాత్రూంలో మొబైల్ ఫోన్‌ను( Mobile Phone ) ఉంచి ఆ ఇంటి ఆడవారు స్నానం చేసే దృశ్యాలు చూద్దామని అతడు అనుకున్నాడు.ఆ పశువాంఛతో అతడు బాత్రూమ్ కిటికీలో మొబైల్ ఉంచాడు.వీడియో రికార్డ్ అవుతున్నప్పుడు మహిళ ఆ కదలికలను గ్రహించింది.

Advertisement

ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే గుమిగూడి సాబ్‌ను పట్టుకున్నారు.అనంతరం అతడిని ఒక కరెంటు స్తంభానికి కట్టేసి చితక బాదుడు బాదారు.

ఆపై సాబ్‌ను పాత హుబ్బళ్లి స్టేషన్‌లోని పోలీసులకు అప్పజెప్పారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

తాజా వార్తలు