కాసేపట్లో హైదరాబాద్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..!

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరికాసేపటిలో హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలోనే ఆయనతో పాటు మరో ఆరుగురు కర్ణాటక మంత్రులు రానున్నారని తెలుస్తోంది.

తెలంగాణలో రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఇవాళ రాత్రి కల్లా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణకు రావాలని కాంగ్రెస్ అభ్యర్థులకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అభ్యర్థులందరితో డీకే శివకుమార్ కీలక భేటీ నిర్వహించనున్నారు.

రేపు కౌంటింగ్ ఫలితాలు వెల్లడి అయిన తరువాత గెలిచిన వారిని ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తరలించనున్నారు.మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఎన్నికల ఫలితాలు వస్తే ఎమ్మెల్యేలు జారిపోకుండా కాంగ్రెస్ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది.

మరోవైపు గెలిచిన అభ్యర్థి సర్టిఫికెట్ ను చీఫ్ ఏజెంట్ కు ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పటికే ఈసీని కోరింది.

Advertisement
శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?

తాజా వార్తలు