కరోనా భయం తో ఏకంగా ఆరువేల కోళ్ల ను సజీవంగా

కరోనా పుణ్యమా అని ప్రపంచదేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 4 వేల మంది మృతి చెందగా, లక్షల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.

చైనా లోని వూహన్ లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచదేశాలకు పాకుతుంది.ఒక్క చైనా లోనే కాకుండా ఇరాన్,ఇటలీ ఇలా పలు దేశాల్లో ఈ కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే భారత్ లో కూడా 62 కేసులు నమోదు కాగా భారత్ పౌల్ట్రీ రైతులపై కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

చికెన్ తింటే కరోనా వస్తుంది అంటూ పుకార్లు షికారు చేయడం తో భారీ గా చికెన్ సేల్స్ పడిపోయాయి.దీనితో పౌల్ట్రీ రైతులు బాగా నష్టపోతున్నారు.

Advertisement

దీనితో చికెన్ ధర భారీ గా పడిపోయింది.ప్రస్తుతం చికెన్ ధర కేజీ రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముడుపోతుంది అంటే దాని ధర ఎంతగా పడిపోయిందో అర్ధం అవుతుంది.అయితే కర్ణాటక కు చెందిన ఒక రైతు కరోనా భయం తో చేసిన పని ఇప్పుడు సంచలనం ఆ మారింది.

కర్ణాటకలోని గోకక్ తాలూకా లోలాసూర్ గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ అనే రైతు కరోనా వైరస్ వదంతులు కారణంగా చికెన్ సేల్స్ పడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై దాదాపు ఆరు వేల కోళ్లను గుంత తవ్వి సజీవంగా పూడ్చి పెట్టాడు.దీనికి సంబందించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

దీనితో ఆ వీడియో చూసిన కొందరు ఆ రైతు పై మండిపడుతుండగా,మరి కొందరు అయ్యో పాపం అంటున్నారు.మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ ఉంది.

వైట్ హౌస్ గేట్‌ను ఢీకొట్టిన వ్యక్తి.. కట్ చేస్తే మృతి..?
Advertisement

తాజా వార్తలు