ఆగిపోతున్న సూపర్ హిట్ టాక్ షో..!

బాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్ షోని ఆపేస్తున్నట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.

కొన్నాళ్లుగా సెలబ్రిటీస్ తో హాట్ హాట్ చిట్ చాట్ తో స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ ని అలరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోని పూర్తిగా ఆపేయాలని నిర్ణయించుకున్నారు.

కాఫీ విత్ కరణ్ షో మీ, నా జీవితంలో ఒక భాగమైంది.ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ద్వారా ఎంతో ఇంప్యాక్ట్ క్రియేట్ చేశాం.

పాప్ కల్చర్ లో అతిపెద్ద షోగా కాఫీ విత్ కరణ్ క్రేజ్ తెచ్చుకుంది.ఈ షోని ముందుకు కొనసాగించలేనని చెప్పేందుకు మనసు ఒప్పుకోవడం లేదని తన ఇన్ స్టాగ్రాం లో మెసేజ్ పెట్టారు కరణ్ జోహార్.

బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షోకి చాలా ఫ్యాన్ క్రేజ్ ఉంది.బాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల మీద కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలు ఆసక్తికరంగా ఉంటాయి.

Advertisement

ఆరు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో త్వరలోనే 7వ సీజన్ మొదలు అవుతుందని అనుకోగా షో ఆపేస్తున్నానని కరణ్ జోహార్ షాక్ ఇచ్చారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు