అత్తగా ప్రమోట్ అయిన కంగనా... మేనల్లుడిని చూస్తూ మురిసిపోతున్న నటి!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కంగనా( Kangana Ranaut ) ఒకరు.

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా నటిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె తరుచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ కిడ్స్( Bollywood Star Kids ) గురించి కంగనా చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదం సృష్టిస్తుంటాయి.

అలాగే సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా ఈమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.

Kangana Shares Her Nephew Photos Goes Viral Details, Kangana, Kangana Nephew, Bo

ఇలా తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలిచే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో మురిసిపోయారు.కంగనా రనౌత్ సోదరుడు అక్షత్ రనౌత్( Akshat Ranaut ) భార్య రీతూ రనౌత్( Ritu Ranaut ) ఇటీవల ఓ పండంటి బాబుకి జన్మనించ్చింది.ఆ బాబు ఫోటోలు, ఆ బాబుని కంగనా ఎత్తుకున్న ఫోటోలు, కంగనా తల్లి, సోదరుడు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
Kangana Shares Her Nephew Photos Goes Viral Details, Kangana, Kangana Nephew, Bo

ఈ సందర్భంగా కంగానా ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

Kangana Shares Her Nephew Photos Goes Viral Details, Kangana, Kangana Nephew, Bo

సోదరుడు, అతని భార్య తల్లితండ్రులు అయ్యారు.చక్కని బాబుకి ( Baby Boy ) జన్మనిచ్చారు.ఆ బాబుకి అశ్వత్థామ( Ashwatthama ) అనే పేరు పెట్టాం.

బాబుని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని పోస్ట్ చేసింది.ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ అలాగే అభిమానులు కంగనా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే కంగనా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలపై కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఇక కొద్ది రోజుల క్రితం రాఘవ లారెన్స్ తో కలిసి నటించిన చంద్రముఖి 2 ( Chandramukhi 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు