అపరాజిత అయోధ్యతో పూర్తి స్థాయి దర్శకురాలిగా కంగనా... కథ అందించిన విజయేంద్ర ప్రసాద్

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్.

ఈ భామ బాలీవుడ్ లో హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు, సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా స్టార్ హీరోలకి తాను ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించుకుంటుంది.

వరుసగా రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కంగనా గత ఏడాది మణికర్ణికతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఝాన్సీ లక్ష్మి భాయ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ అందించారు.

ముందుగా ఈ సినిమాని మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన మధ్యలో అతను తప్పుకోవడంతో దర్శకత్వ బాద్యతలు కంగనా తీసుకుంది.ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు ఈ అమ్మడు సిద్ధమైంది.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం, సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలోని అంశాలతో సినిమా తీసేందుకు సిద్ధం అవుతుంది.అయోధ్య రామమందిర నిర్మాణం ఆధారంగా విజయేంద్రప్రసాద్‌ రచిందిన అపరాజిత అయోధ్య అనే కథ కంగనాకి భాగా నచ్చడంతో దానిని ఆమె నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా చేయడానికి రెడీ అయ్యింది.

Advertisement

దీన్ని మరో దర్శకుడితో నిర్మించాలనుకొన్నాను.ఇదే సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను.

విజయేంద్రప్రసాద్‌ రచించిన ఈ సినిమా కథ పెద్ద కాన్వాస్‌పై సెట్‌ చేసిన చిత్రంగా భావిస్తున్నాను.నా సహకార భాగస్వాములు కూడా నేను దర్శకత్వం వహించాలని ఆసక్తిగా ఉన్నారు.

చివరకు నేను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అని భావించాను అని కంగనా తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సినిమా కోసం తన సామర్ధ్యం మొత్తం ఉపయోగించడానికి వీలుగా ఇందులో తను నటించడం లేదని కంగనా స్పష్టం చేసింది.

కథాంశం బట్టి చాలా జాగ్రత్తగా తీయాల్సిన సినిమా కావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు కొత్తిమీర‌తో ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు