పార్టీని వీడిన మహేంద్రన్ పై కమల్ హాసన్ ఫైర్..!

కమల్ హాసన్ మక్కల్ నీధి మయ్యం తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఘోర పరాజయపాలైన విషయం తెలిసిందే.

ఒక్క స్థానంలో కూడా పార్టీ గెలవకపోవడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన కొద్దిరోజులకే పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ పార్టీ నుండి బయటకు వచ్చారు.పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని మహేంద్రన్ విమర్శించారు.

అయితే మహేంద్ర అలా అనడంపై మక్కల్ నీధి మయ్యం అధినేత కమల్ హాసన్ మండిపడ్డారు.మహేంద్ర ఒక ద్రోహి అని అన్నారు కమల్.

జరిగిన ఎన్నికల్లో పార్టీ వీరోచితంగా పోరాడిందని కార్యకర్తలు బాగా కష్టపడ్డారని అన్నారు కమల్.అయితే పార్టీలో శత్రువులతో పాటుగా ద్రోహులుగా ఉన్నారని అన్నారు కమల్ హాసన్.

Advertisement

అలాంటి వారిలో మహేంద్రన్ ముందు వరసలో ఉంటారని అన్నారు కమల్ హాసన్.త్వరలో వీళ్లందరినీ తొలగించాలని నిర్ణయించామని అన్నారు.

మహేంద్ర< పై వేటు పడుతుందని భావించి అతనే తెలివిగా పార్టీ నుండి తప్పుకున్నాడని అన్నారు.పార్టీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని ఎన్నికల ఫలితాలు చూసి పార్టీ కార్యకర్తలు ధైర్యాన్ని కోల్పోవద్దని ముందు ముందు ప్రజలకు తమ పార్టీ మీద నమ్మకం పెరుగుతుందని అన్నారు కమల్ హాసన్.

Advertisement

తాజా వార్తలు