ఇండియాలో బెస్ట్ యాక్టర్స్ పేర్లు చెబితే అందులో ముందు వరుసలో వచ్చే పేరు కమల్ హసన్.తన నటనతో కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా దేశం మొత్తం అభిమానులని సొంతం చేసుకున్న కమల్ హసన్ ఎప్పటికప్పుడు కొత్త కథలు, ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని సందడి చేస్తూ ఉంటారు.
కమల్ హసన్ సినిమా ఆంటే కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.ప్రత్యేకత లేకపోతే కమల్ హసన్ సినిమా అవదు అనేంతలా అతని బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోయింది.
అతని సినిమాల కోసం ఎప్పుడు ఒక వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.ఇప్పుడు సౌత్ లో అందరూ పాన్ ఇండియా సినిమాలు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కమల్ హసన్ ఎప్పుడో రెండు దశాబ్దాలు క్రితమే ఈ ప్రయత్నం మొదలుపెట్టాడు.
తన కలల ప్రాజెక్ట్ గా ఇండియన్ హిస్టోరికల్ కథాంశంతో మరుదనాయగం అనే సినిమాని మొదలు పెట్టాడు.
అప్పట్లోనే ఆ సినిమాకి వంద కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు.అప్పట్లో ఈ సినిమా ప్రారంభోత్సవానికి క్వీన్ ఎలిజబెత్ 2 ని అతిధిగా పిలిచాడు.దాంతో ఈ సినిమాపై అందరికీ ఆసక్తి కలిగింది.పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాని ఇండియన్ భాషలతో పాటు హాలీవుడ్, ఇతర విదేశీ భాషలలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
షూటింగ్ కూడా మొదలుపెట్టి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.అందులో కమల్ కి సంబందించిన లుక్స్ కూడా రిలీజ్ చేశారు.
తరువాత ఈ సినిమా బడ్జెట్ సమస్యతో ఆగిపోయింది.సుదీర్ఘ కాలం ఆగిపోయిన ఈ సినిమాని కమల్ మళ్ళీ పట్టాలు ఎక్కించాలని అనుకున్న వర్క్ అవుట్ కాలేదు.
తాజాగా విజయ్ సేతుపతి మురుదనాయగం సినిమా గురించి సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ ద్వారా కమల్ హసన్ ని అడిగారు.ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ మరుదనాయగం సినిమాని 40ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కథగా రాసుకున్నాను.
నలభై ఏళ్ల హీరోనే ఆ సినిమా చేయాలి.నేను చేయాలంటే మాత్రం కథలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది.
అందుకని ఆ సినిమా ఉండదని కన్ఫర్మ్ చేశాడు.