కల్లూరు CHC హాస్పిటల్ ను అభివృద్ధి చేసి సీజనల్ వ్యాధులను అరికట్టాలి..PYL-POW డిమాండ్

వర్షాకాలంలో ప్రతి ఏడాది సీజనల్ వ్యాధుల సోకి, ప్రజలు అవస్థలు పడాల్సి వస్తుందని, సీజన్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని.

POW జిల్లా అధ్యక్షురాలు గోకినపల్లి లలిత,PYL జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ లు డిమాండ్ చేశారు.

మంగళవారం స్థానిక కల్లూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సమస్యలపై సర్వే చేసి వైద్య సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా PYL జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్, POW జిల్లా అధ్యక్షురాలు గోకినపల్లి లలిత మాట్లాడుతూ పారిశుద్ధ్యం పనులు సరిగ్గా చేయక పోవడం వల్లే దోమలు ఉత్పత్తి అయి డెంగ్యూ,మలేరియా వైరల్ జ్వరలు ప్రజలని పట్టి పీడిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రతి యేటా సీజనల్ వ్యాధులు రోజుకు కొత్త జబ్బు పుట్టుకొస్తుంటే వాటిని అరికట్టేందుకు సరైన సిబ్బంది లేక 5 సంవత్సరాలు కావస్తుందని విమర్శించారు,కల్లూరు PHC ను CHC గా మార్చి ఏడాది కాలం గడుస్తున్నా గాని హాస్పటల్ కు సరిపడా బిల్లింగ్ గాని, డాక్టర్, ఏఎన్ఎం, స్వీపర్, సిస్టర్ పోస్టులు సాంక్షన్ చేయని దౌర్భాగ్య పరిస్థితిలో వైద్యశాఖ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, తక్షణమే నూతన భవనాన్ని, సరిపడా వైద్య సిబ్బందిని కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, గ్రామాలల్లో దోమల విరుగుడికి పగింగ్ చర్యలు చేపట్టాలని, వీధులన్నీ శుభ్రపరచాలని, హాస్పిటల్ ఆవరణను శుభ్రపరచాలని శుభ్రపరిచి, గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించాలని, మండల కేంద్రంలోని హాస్పటల్ అభివృద్ధి చేసి కనీస వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడతామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో POW డివిజన్ కోశాధికారి తరిమెల, ప్రజాపంథా పట్టణ కార్యదర్శి మాలాద్రి, ఐ ఎఫ్ టి యు నాయకుల పుల్లారావు, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు