కొడుకుతో క్యూట్ ఫోటో షేర్ చేసుకున్న కాజల్ అగర్వాల్.. అది లేకుండా మీరు ఒక్కరే ఉన్నారంటూ కామెంట్స్?

ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్లు పెళ్లి లైఫ్ ను అస్సలు ఇష్టపడరు.తమ కెరీర్ ను మొత్తం నటనకే అంకితం చేస్తారు.

మరి కొంతమంది హీరోయిన్లు అలా కాదు.తమ లైఫ్ లో నటన ఒక భాగమైతే జీవితాన్ని కూడా మరో భాగంగా తీసుకుంటారు.

అలా పెళ్లి చేసుకొని నటన జీవితాన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు.ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

మరి కొంతమంది నటన జీవితానికి గుడ్ బై చెప్పి పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇక కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుని నటన జీవితాన్ని కంటిన్యూ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందాలతో అందర్నీ తన వైపుకు మలుపుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్.ఇక తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదని చెప్పవచ్చు.

అతి తక్కువ సమయంలో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.అలా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని అభిమానులుగా మార్చుకుంది.

లక్ష్మి కళ్యాణం సినిమాతో తొలిసారిగా కాజల్ తెలుగు తెరకు పరిచయం అయింది.ఆ తరువాత మెగా హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో హీరోయిన్గా నటించినది.

ఇక ఈ సినిమాతో తను మంచి సక్సెస్ అందుకుంది.నిజానికి కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే.తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ స్టార్ హోదాకు చేరుకుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

మంచి హోదాలో ఉన్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లూను ప్రేమ పెళ్లి చేసుకుంది.అప్పటి నుంచి ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా టూర్స్ ప్లాన్స్ వేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటూ తన భర్త తో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసేది.

Advertisement

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.కొడుకు పుట్టాక కాజల్ ను చూసి తెలుగు ప్రేక్షకులు చాలా మురిసిపోయారు.ఇక మళ్లీ మునుపటిలా కనిపించడానికి బాగా వర్క్ అవుట్ లు కూడా చేస్తుంది.

ఇక తన వర్కౌట్లు చేసే వీడియోలను అప్పుడప్పుడు  సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తూ ఉంటుంది.ఇక తన బాబు ఫోటోలు కూడా బాగా పంచుకుంటూ.

చాలా వరకు తన బాబు ఫేస్ చూడనివ్వకుండా కాజల్ జాగ్రత్త పడుతుంది.ఈ విషయంలో మాత్రం ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారని చెప్పవచ్చు.

ఇక ఇప్పుడు కూడా బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని కూడా పంచుకుంటూ ఉంది.అవకాశాలు రావడంతో కూడా నటించడానికి సిద్ధంగా ఉంది కాజల్.ఆ మధ్యనే పలు అడ్వర్టైజ్మెంట్లలో కూడా కనిపించింది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను తన ఇన్స్టాలో మరో పోస్ట్ షేర్ చేసుకుంది.అందులో తను తన బాబుని పట్టుకొని విండో నుంచి బయటికి చూస్తున్నట్లు కనిపించింది.

ఇక ఆ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారగా తన ఫ్యాన్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.ఇక ఓ నెటిజన్ కాజల్ ప్రయాణాన్ని చూసి మురిసిపోతూ.

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా సెటిల్ అయ్యింది మీరు ఒక్కరే అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

తాజా వార్తలు