కరోనాతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఏడో తరం పీఠాధిపతి మృతి.. !

దేశంలో ఊహించని విధంగా కరోనా వ్యాప్తి జరుగుతుంది.దీని పై ప్రపంచ ఆరోగ్య సంస్దలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రకృతికి అనుగుణంగా మనుషులు జీవించాలని కాలం చెబితే, మానవులు మాత్రం ప్రకృతికి విరుద్ధంగా జీవించడానికి అలవాటుపడ్దారు.ఇలా మానవ తప్పిదాల వల్ల చోటు చేసుకుంటున్న ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవడంలో మనిషి మేధస్సు సరిపోవడం లేదు.

అందుకే ఈ విపత్తులు మనిషి జీవితాన్ని శాసిస్తున్నాయి.ఇకపోతే కరోనా వల్ల కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఏడో తరం పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి(75) నిన్న కన్నుమూశారని సమాచారం.

ఇటీవల కరోనా బారినపడిన ఆయన కడపలో చికిత్స తీసుకుని కోలుకున్నారు.కానీ మళ్లీ అస్వస్థతకు గురవగా వెంటనే కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన ఫలితం లేదు.

Advertisement

ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది.ఇక 1946లో జన్మించిన శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి 1969లో ఏడో తరం పీఠాధిపతిగా నియమితులు అయినారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు