కే ఏ పాల్ హాట్ కామెంట్స్

మునుగోడు ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులకు భిన్నంగా ఆయన నేరుగా జనాల మధ్యలోకి వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

మరోవైపు చండూరులో కేఏ పాల్ కు చెందిన రెండు వాహనాలు ప్రచారాన్ని నిర్వహిస్తుండగా.వెనుక ఆయన వస్తుండగా అధికారులు అడ్డుకున్నారు.

దీంతో అధికారులపై పాల్ మండిపడ్డారు.తాను కాబోయే సీఎంనని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఆయన అన్నారు.

అంతేకాదు నీ పేరు ఏమింటంటూ అధికారి మెడలోని గుర్తింపు కార్డును లాక్కునే ప్రయత్నం చేశారు.దీంతో, పక్కనున్న అధికారులు పాల్ కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.

Advertisement

మరోవైపు పాల్ ప్రచారం ఆసక్తికరంగా సాగుతోంది.ఓటర్లకు వాటర్ బాటిల్స్ పంచుతూ, స్వీట్లు ఇస్తూ ఆయన ప్రచారం చేస్తున్నారు.

వార్ వన్ సైడే.గెలుపు నాదే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు