నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal )జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను వర్చువల్ విధానంలో రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట ఈడీ అధికారులు హజరుపర్చనున్నారు.

లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు ( Officers of Enforcement Directorate ) న్యాయస్థానానికి వివరించనున్నారు.అదేవిధంగా కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరనున్నారు.

మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ నేపథ్యంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరగనుంది.ఈడీ కస్టడీని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు