ఆ 5 సినిమాలు ఎన్టీఆర్ కాకుండా మరొకరు చేసుంటే.. హిట్ అయ్యేవి కాదా?

కథ కథనం ఎలా ఉన్నా కొన్ని కొన్ని సినిమాలు కేవలం హీరోలతోనే హిట్ అవుతూ ఉంటాయి.

ఇలా తన హీరోయిజం తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే హీరో ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్.

ఆయన పాత్రలో ఒదిగిపోయి నటించడం.నట విశ్వరూపాన్ని చూపించడం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది.

ఇక ఆయన పర్ఫామెన్స్ చూడడానికి దర్శకుడు, కథ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళుతుంటారు.ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సక్సెస్ లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసాడు జూనియర్ ఎన్టీఆర్.

ఈ మధ్య కాలంలో ఏ హీరోకి సాధ్యం కానీ సరికొత్త రికార్డును సృష్టించాడు అని చెప్పాలీ.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాతో తనలోని నట విశ్వరూపాన్ని చూపించి అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు.

Advertisement

ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్ సినిమాతో, బాబు దర్శకత్వంలో వచ్చిన తారక్ త్రిపాత్రాభినయ సినిమా జై లవకుశ, త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్.

ఇలా వరుసగా ఆరు హిట్ సినిమాలను సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇక ఈ అన్ని సినిమాల్లో కేవలం ఎన్టీఆర్ కారణంగానే హిట్ సాధించాయి అన్నది ప్రేక్షకులు అనుకుంటున్న మాట.ఒక టెంపర్ సినిమా మినహా మిగతా అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయి అంటే కేవలం ఎన్టీఆర్ వల్లే అంటున్నారు అభిమానులు.

ఎన్టీఆర్ కాకుండా మరో హీరో ఆ సినిమాలు చేసుంటే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడేవారు అంటూ అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ఒక టెంపర్ మినహా మిగతా అన్ని సినిమాల్లో కథకు కాస్త బలహీనంగా ఉంటుంది.కానీ ఎన్టీఆర్ మాత్రం కథ బలహీనంగా ఉన్న తన నటనతో మూవీని నెట్టుకొచ్చాడు.

జై లవకుశ సినిమా చూస్తే ఎన్టీఆర్ నటన సినిమాకు ఎంత ప్రాణం పోసింది అర్థమవుతుంది అని అభిమానులు అంటున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు