రామాయణ: ఎన్టీఆర్ బెస్ట్ ఆప్షన్

ప్రస్తుతం దేశమంతా ఏ ఇండస్ట్రీలో వెతికినా పౌరాణిక పాత్రలకు సెట్టయ్యే స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఎన్టీఆర్ ఒక్కడే.మిగతా హీరోలు అలాంటి హిస్టారికల్ పాత్రలకు ఎంతవరకు న్యాయం చేస్తారో తెలియదు గాని తారక్ మాత్రం కచ్చితంగా తెరపై ఆకర్షిస్తాడని ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు.

చిన్న తనంలోనే బాల రామాయణ సినిమాతో ఎన్నో ప్రశంసలు అవార్డులు అందుకున్న జూనియర్ యమదొంగలో యముడు పాత్రని చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చిన సంగతి తెలిసిందే.అందుకే అల్లు అరవింద్ బాలీవుడ్ నిర్మాతలతో కలిసి నిర్మించబోయే 1500కోట్ల రామాయణలో జూనియర్ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకుంటే బావుంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మూడు భాగాలుగా తెరకెక్కనున్న రామాయణ మూడు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సౌత్ నార్త్ ఆడియెన్స్ ని మెప్పించాలి అంటే మంచి మార్కెట్ ఉన్న హీరోనే కాకుండా నటనతో మెప్పించే హీరో అయ్యి ఉండాలి.మార్కెట్ పరంగా ఆలోచిస్తే నేషనల్ వైడ్ గా జూనియర్ కి అంత రేంజ్ లేకపోయినా నటనతో అయితే పూర్తిగా న్యాయం చేయగలడని చెప్పవచ్చు.

ఇకపోతే అల్లు అరవింద్ మొదట రామ్ చరణ్ ని అనుకున్నట్లు ఇటీవల టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే మెగా హీరో ఇంట్రెస్ట్ చూపకపోవడంతో బాలీవుడ్ స్టార్ హీరోపై చిత్ర యూనిట్ కన్నేసినట్లు టాక్.

Advertisement
షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!

తాజా వార్తలు