వైట్‌హౌస్‌లో భారతీయ మహిళకు కీలక పదవి.. నామినేట్ చేసిన జో బైడెన్ , ఎవరీ ఆర్తి ప్రభాకర్..?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారతీయులకు తన అధికార యంత్రాంగంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ వస్తున్నారు.

సొంత పార్టీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఖాతరు చేయడం లేదు.

తాజాగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సైన్స్ సలహాదారుగా ఇండో అమెరికన్ , భౌతిక శాస్త్రవేత్త ఆర్తి ప్రభాకర్‌ను జో బైడెన్ నామినేట్ చేశారు.దీనికి సెనేట్‌ ఆమోదం లభిస్తే వైట్‌హౌస్ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా బాధ్యతలు చేపతారు.

ఇప్పటి వరకు ఈ పదవిలో వున్న ఎరిక్ ల్యాండర్ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది.దేశంలో సైన్స్ ఎజెండాను నెరవేర్చడంలో అమెరికా అధ్యక్షుడికి సహాయం చేయడం సలహాదారు ప్రధాన విధి.

సైన్స్ కన్సల్టెంట్‌గా, సైన్స్ పాలసీ సమస్యలను పరిష్కరించాల్సి వుంటుంది.ఇకపోతే.

Advertisement

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆర్తి ప్రభాకర్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది.తొలుత చికాగోకు అనంతరం టెక్సాస్‌కు వీరి ఫ్యామిలీ మకాం మార్చింది.

టెక్సాస్ టెక్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందిన ఆర్తి ప్రభాకర్.కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లయిడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ అందుకున్నారు.

ఇదే సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేశారు.అనంతరం ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ అసెస్‌మెంట్‌లో కాంగ్రెషనల్ ఫెలోగా లెజిస్లేటివ్ శాఖలో ఆర్తి ప్రభాకర్ తన కెరీర్‌ను ప్రారంభించారు.1993లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ హయాంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు చీఫ్‌గా పని చేశారు.ఆ తర్వాత 2012 నుంచి 2017 వరకు యునైటెడ్ స్టేట్స్ డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీకి హెడ్‌‌గా విధులు నిర్వహించారు.

కొద్దిరోజుల క్రితం ఇండో అమెరికన్ మహిళ రాధా అయ్యంగర్‌ ప్లంబ్‌ను పెంటగాన్‌లోని కీలక పదవికి నామినేట్ చేశారు జో బైడెన్.ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ప్లంబ్‌ను గత బుధవారం అక్విజిషన్ అండ్ సస్టైన్‌మెంట్‌కు డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌ పదవికి నామినేట్ చేశారు బైడెన్.గతంలో రాధా అయ్యంగర్ గూగుల్‌లో ట్రస్ట్ అండ్ సేఫ్టీకి రీసెర్చ్ అండ్ ఇన్‌సైట్స్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

అక్కడ బిజినెస్ అనలిటిక్స్ , డేటా సైన్స్ అండ్ టెక్నికల్ రీసెర్చ్‌లో క్రాస్ ఫంక్షనల్ టీమ్‌లకు నాయకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు