లక్‌ అంటే ఇతడిదే : ఉద్యోగం లేక అవస్థలు పడుతున్న వ్యక్తికి ఒక్క ట్వీట్‌తో ఒకేసారి పది సంస్థలు ఆఫర్‌ ఇచ్చాయి

ఇండియాలో మంచి ఉద్యోగం లభించక, బతుకుదెరువు కోసం అప్పుచేసి అరబ్‌ దేశాలు వెళ్లే వారు ఎంతో మంది ఉంటారు.

అక్కడ చేసేది చిన్న ఉద్యోగమే అయినా కూడా వచ్చేది డాలర్లు అవ్వడం వల్ల ఇక్కడికంటే అక్కడ బాగా బతికేయవచ్చు అంటూ అంతా భావిస్తారు.

అందుకే ఇండియాకు చెందిన పలు వెనకబడిన ప్రాంతాల వారు దుబాయి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వారి గోసలు మామూలుగా ఉండవు.

అత్యంత దయనీయ పరిస్థితిని వారు ఎదుర్కోవడం మనం ఇప్పటి వరకు చూశాం.

తాజాగా యూఏఈలో రాజేష్‌ అనే వ్యక్తి అష్ట కష్టాలు పడ్డాడు.ఏడు లక్షలు బ్యాంకులోను తీసుకుని బతుకు దెరువు కోసం యూఏఈ వెళ్లిన అతడికి అక్కడ మంచి ఉద్యోగం లభించలేదు.ఒక చిన్న సూపర్‌ మార్కెట్‌లో జాబ్‌ చేస్తే వచ్చే జీతం అక్కడ అతడి మెయింటెన్స్‌కు సరిపోయేది.

Advertisement

దాంతో ఆ జాబ్‌ మానేసి మరోజాబ్‌ వెదుక్కోవాలనుకున్నాడు.జాబ్‌మానేసిన రాజేష్‌కు మరో జాబ్‌ లభించడం ఇబ్బంది అయ్యింది.

ఉన్న ఉద్యోగం వదిలేయడంతో రూం ఖర్చులు మరియు అక్కడ మెయింటెన్స్‌ చాలా కష్టం అయ్యింది.స్నేహితుల సాయంతో తన బతుకును వెళ్లదీస్తూ వచ్చాడు.

తన దయనీయమైన పరిస్థితిని ట్విట్టర్‌లో ఈనెల 5వ తారీకున పోస్ట్‌ చేశాడు.ఆ ట్వీట్‌లో ఇండియన్‌ విదేశాంగశాఖను ట్యాగ్‌ చేశాడు.రాజేష్‌ ట్వీట్‌ను చూసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళిధరన్‌ చూసి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

యూఏఈలో ఉన్న ఇండియన్‌ రాయబార కార్యలయంకు అతడి విషయాన్ని చెప్పడంతో అక్కడి వారి విజ్ఞప్తి మేరకు పది కంపెనీలు అతడికి ఉద్యోగంను ఆఫర్‌ చేశాయి.దాంతో అతడు సంతోషంతో మునిగి పోయాడు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
ఓవరాక్షన్ చేసిన పోలీస్.. ట్రక్ డ్రైవర్‌ ఇచ్చిన ట్విస్ట్‌కి పరార్.. (వీడియో)

పది జాబ్‌లలో మంచి జాబ్‌ను చూసుకుని జాయిన్‌ కాబోతున్నాడు.తనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన మంత్రికి రాజేష్‌ కృతజ్ఞతుల తెలియజేశాడు.

Advertisement

మొత్తానికి లక్‌ అంటే రాజేష్‌దే కదా.!.

తాజా వార్తలు