భువనగిరిలో జిట్టా విగ్రహం ఏర్పాటు చేస్తాం:ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ( Jitta Balakrishna Reddy )విగ్రహాం ఏర్పాటు చేస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జిట్టా బాలకృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జిట్టా బాలకృష్ణారెడ్డి ఎన్నో పోరాటాలు నిర్వహించారని,ఆస్తులను అమ్మి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు.భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలిపారు.

Latest Video Uploads News