జియో వలన ఎయిర్ టెల్ కి వేల కోట్ల నష్టం

జియో రావడం వలన సామన్య ప్రజలు లాభపడ్డారు కాని, బడా బడా మొబైల్ నెట్వర్కింగ్ కంపెనీలు మాత్రం తీవ్ర నష్టాలని చూసాయి, చూస్తూనే ఉన్నాయి.

నష్టాలు ఎందుకు రావు .

జియో సిమ్ ఉన్న ప్రతి మనిషి ఇంటర్నెట్ డెటా రిచార్జ్ చేసుకోవడమే మానేసాడు.కాల్స్ కూడా ఉచితంగా జియో ఇస్తూ ఉండటంతో, నెలకోసారి కూడా మిగితా సిమ్స్ కి రిఛార్జ్ చేయడం లేదు చాలామంది.2G/3G మొబైల్స్ ఉన్న జనాభా మాత్రమే, ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ లాంటి నెట్వర్క్ వాడుతూ, రిఛార్జులు చేయిస్తున్నారు.సరే ఇదంతా ఎందుకు కాని, సింపుల్ గా, జియో వలన ప్రధాన పోటిదారులు ఏయిర్ టెల్ కంపెనీ వారు ఎంత నష్టపోయారో చూద్దాం.2015వ సంవత్సరం మూడొవ క్వార్టర్, అంటే అక్టోబరు నుంచి డిసెంబర్ వరకు ఏయిర్ టెల్ కంపెనీ 1,108 కోట్ల లాభాల్ని వెనకేసుకుంది.మరి 2016లో, సరిగ్గా అదే అక్టోబర్ - డిసెంబర్ మధ్య వచ్చిన లాభం ఎంతో తెలుసా? పెద్ద కంపెనీ కాబట్టి పెరగాలి అని అనుకుంటాం కాని, జియో రావడం వలన లాభాలు ఏకంగా 55% పడిపోయాయి అంటే నమ్మగలరా? గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబర్‌ పూర్తయ్యేవరకు ఏయిర్ టెల్ కేవలం 504 కోట్ల లాభాల్ని వెనకేసుకున్నట్లు ఆ సంస్థ నిన్న ఒక రిపోర్టులో తెలిపింది.ఏడాది మొత్తంలో వేయి కోట్లకు పైగా లాభాల్ని జియో వలన పోగొట్టుకుందట ఎయిర్ టెల్.

ఈ ఏడాది కూడా ఎయిర్ టెల్ కి కష్టాలు తప్పవంటున్నారు మార్కేట్ విశ్లేషకులు.

వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు