జాబ్ మానేసి ఫుల్‌టైమ్‌ మంత్రగత్తెగా మారిన మహిళ.. నెలకి 7 లక్షల సంపాదన..

మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ మంత్రగాళ్లుమంత్రగత్తెలుగా( Spiritual awakening ) చెప్పుకునే వారికి మాత్రం డబ్బులు లక్షలలో రాలుతాయి.

ఈ విషయం మనదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చాలాసార్లు నిరూపితం అయింది.

తాజాగా మంత్రగత్తెగా మారితే ఎంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చో ఒక మహిళ నిరూపిస్తోంది.వినడానికి ఇది విడ్డూరంగా అనిపించినా మూఢనమ్మకాలను ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు కాబట్టి వారి ఆటలు సాగుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.జెస్సికా కాల్డ్‌వెల్ (29)( Jessica Caldwell ) ఒక మాజీ బ్యూటీషియన్.ఆమె 2019లో ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా మంత్రవిద్యపై తనకున్న ఆసక్తిని గుర్తించింది.

తర్వాత ఫుల్ టైమ్ మంత్రగత్తె కావడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.ఆమె టారో కార్డ్‌లను చదవడం, స్ఫటికాలతో పని చేయడం నేర్చుకుంది.

Advertisement

ఇప్పుడు సెలబ్రిటీలతో సహా 5,000 మంది క్లయింట్‌లను కలిగి ఉండటం విశేషం.

ఆమె నెలకు రూ.7 లక్షలు సంపాదిస్తుంది.ఇన్‌స్టాగ్రామ్( Instagram ) ద్వారా మాత్రమే పనిచేస్తుంది.

ఆమె కుటుంబం మొదట్లో ఆందోళన చెందింది, కానీ ఇప్పుడు ఆమె బాగా డబ్బు సంపాదించడంతో వారు ఆమెకు మద్దతు ఇచ్చారు.

జెస్సికా కఠినమైన ప్రేమ సలహాలతో సహా వ్యక్తుల కోసం రీడింగ్‌లను అందిస్తుంది.స్పెల్ వర్క్, ఆధ్యాత్మికతపై ఉచిత సలహాలను అందిస్తుంది.రక్షణ ఆకర్షణలను ఎలా సృష్టించాలో.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇతరులను ఎలా ఆకర్షించాలో ప్రజలకు బోధిస్తుంది.ఈమె గురించి తెలిసిన నెటిజన్లు ఇది కూడా ఒక ప్రొఫెషన్ అంటూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

మంత్ర విద్యతో ఇన్ని డబ్బులు సంపాదించవచ్చని తమకు ఇప్పుడే తెలిసిందంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు