విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై  జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం..!!

ఏపీ రాజకీయాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.

కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెలుగు ప్రజలు ఎంతో పోరాటం చేసుకునే సాధించిన సంస్థ అని దాన్ని ప్రైవేటీకరణ చేయటం కేంద్రం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసినట్లు అని చాలా మంది చెబుతున్నారు.ఈ క్రమంలో కార్మిక సంఘాలు అదే విధంగా రాజకీయ పార్టీలు విశాఖలో నిరసనను తెలియజేస్తూ కేంద్రంపై భగ్గుమంటున్నాయి.

Jd Lakshmi Narayana Sensational Decision On Vizag Steel Plant Andhra Pradesh,viz

మరోపక్క ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కేంద్రానికి వెనక్కి తగ్గాలని లెటర్ రాయడం జరిగింది.అయినా గాని కేంద్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది.

పరిస్థితి ఇలా ఉండగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.దీని పై నేడు విచారణ చేయానుంది హైకోర్టు.

 .

Advertisement

తాజా వార్తలు