తన మొదటి సినిమా చూసేందుకు జయలలితకు నో పర్మిషనట!

భారతీయ నటిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్న జయలలిత గురించి అందరికీ తెలిసిందే.

ఈమె రాజకీయాల్లోకి రాకముందు తన కెరీర్ ను సినీ పరిశ్రమలో పరిచయం చేసింది.

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించిన జయలలిత సుమారుగా 140 సినిమాలలో నటించింది.హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.

Jayalalitha Death Anniversary Late Actress Could Not Watch Her First Tamil Movie

ఇదిలా ఉంటే రాజకీయ ఈ రంగంలో కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఆమె ఎం.

జి.ఆర్ సరసన ఎన్నో సినిమాలలో నటించగా.ఆయనతోపాటు రాజకీయాల్లోకి ప్రవేశించింది.

Advertisement

మొదట తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికకాగా.ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి రెండో మహిళ ముఖ్యమంత్రిగా గెలుపొందింది.

ఇలా తన రాజకీయం పరంగా ఎంతో మంది ప్రజలకు సేవలు అందించి ప్రజల గుండెల్లో అమ్మగా నిలిచింది.ఇదిలా ఉంటే ఆమె 2016 డిసెంబర్ 5న లోకాన్ని వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24 న జయలలిత 73 వ జయంతి సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.కానీ ఆమె మొదటి సినిమాను ఆమె చూసేందుకు నో పర్మిషన్ అని అన్నారట.

ఇంతకీ కారణం ఏమిటో తెలుసుకుందాం.ఆమె తమిళంలో హీరోయిన్ గా నటించిన సినిమా వెన్నిర అడై.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఈ సినిమా 1965 లో విడుదల కాగా ఈ సినిమాను చూడటానికి అనుమతి ఇవ్వలేదట.ఎందుకంటే ఈ సినిమాకి అప్పట్లో ఏ సర్టిఫికెట్ వచ్చిందని, ఆ సందర్భంగా ఆమె వయసు 17 సంవత్సరాలు ఉండగా సినిమా చూసేందుకు బోర్డు అనుమతి ఇవ్వలేదు.

Advertisement

ఈ సినిమాలో స్లీవ్లెస్ దుస్తులు ధరించి జలపాతం దగ్గర జయలలిత డాన్స్ చేయగా దానిపై కూడా సెన్సార్ బోర్డ్ అసహనం వ్యక్తం చేసింది.

తాజా వార్తలు