క్రష్ ఉన్న హీరో అయినా సరే.. విజయ్ కు జాన్వీ అందుకే నో చెప్పిందా..

మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా నటీ నటులు కూడా మారుతున్నారు.

ఇది వరకు లాగా కాకుండా హీరోయిన్స్ తమ మనసులోని మాటలను డైరెక్ట్ గానే చెప్పేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.

లవ్ గురించి అయినా, లివింగ్ రిలేషన్ షిప్ గురించి అయినా, క్రష్ గురించి అయినా ఓపెన్ గానే చెప్పేస్తూ అందరికి షాక్ ఇస్తున్నారు.ఇటీవలే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా తన క్రష్ ఎవరో చెప్పేసింది.

ఈమెకు టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో డేటింగ్ కు కూడా వెళ్తా అంటూ చెప్పుకొచ్చింది.అయితే ఇక్కడే అందరికి ఒక విషయం అర్ధం కావడం లేదు.

జాన్వీ కపూర్ రౌడీ స్టార్ అంటే క్రష్ అంటూ చెబుతుంది.కానీ ఈయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంది అని ఎప్పటి నుండో ఆరా తీయగా ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.

Advertisement

తాజాగా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా రిలీజ్ అయ్యింది.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్.అయితే ఈ సినిమా ఇంత ప్లాప్ అవ్వడానికి కారణాలు చాలానే చెబుతున్నారు.

ముఖ్యంగా హీరోయిన్ కూడా ఈ సినిమాకు మైనస్ అయ్యింది అంటున్నారు ప్రేక్షకులు.ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

అయితే ఈమె మాత్రం దారుణంగా నిరాశ పరిచింది.ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ముందుగా జాన్వీ కపూర్ ను తీసుకోవాలి అనుకున్నాడట.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

కానీ కరణ్ జోహార్ కారణంగానే అనన్య పాండే ను తీసుకోవాల్సి వచ్చింది అని అంటున్నారు.అయితే తాజాగా మరికొంత ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వచ్చింది.

Advertisement

ఈ సినిమా కోసం పూరీ జాన్వీకి స్క్రిప్ట్ వినిపించగా ఆమెకు ఆ పాత్ర అంతగా నచ్చలేదట.ఈ పాత్ర ఒప్పుకుంటే నష్టపోతాను అని ముందే గ్రహించి ఈ బ్యూటీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది.అందుకే ఆమె క్రష్ అయిన విజయ్ దేవరకొండకు జంటగా అయినా సరే ఈమె ఈ సినిమాకు నో చెప్పిందని.

ఈమె తెలివికి అందరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.అయితే ఈమె చేసుంటే సినిమాకు కొద్దిగా అయినా ప్లస్ అయి ఉండేది అని మరికొంత మంది ఆలోచన.

తాజా వార్తలు