Pawan Kalyan Varahi : జనసేనాని పవన్ వారాహి షెడ్యూల్ ఖరారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారైంది.

ఈ మేరకు రేపు ప్రారంభం కానున్న వారాహి యాత్ర( Varahi Yatra ) వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది.

మొదటి విడతగా తాను పోటీ చేసే నియోజకవర్గంతో పాటు పది నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్రను నిర్వహించనున్నారు.ఈ క్రమంలోనే రేపు పిఠాపురం నియోజకవర్గంలో( Pithapuram Constituency ) జనసేనాని వారాహి విజయయాత్రను ప్రారంభిస్తారు.

అలాగే ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలిలో యాత్ర కొనసాగనుంది.అదేవిధంగా 7వ తేదీన పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరంలో పవన్ యాత్ర సాగనుంది.కాగా ఒక్కో నియోజకవర్గంలో రెండు సమావేశాలతో పాటు ఒక బహిరంగ సభను నిర్వహించనున్నారు.

అలాగే మండల, బూత్ స్థాయి నాయకులతో పాటు పార్టీ నేతలు, వీర మహిళలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Advertisement
తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...

తాజా వార్తలు