Janasena: 2024 ఎన్నికలకు జనసేన కొత్త పాట వీడియో రిలీజ్..!!

2024 ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.ఎట్టి పరిస్థితులలో వైసీపీ గెలవకూడదని.

జగన్ ముఖ్యమంత్రి కాకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్.మరోపక్క మిత్రపక్షం బీజేపీని ఈ కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.2014 ఎన్నికల మాదిరిగా 2024 ఎన్నికల గెలవాలని భావిస్తున్నారు.తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ఇప్పటికే 24 అసెంబ్లీ మూడు ఎంపీ స్థానాలలో జనసేన పోటీ ఖాయం అయింది.

దీంతో వరుసగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ మరో పక్క క్యాడర్ ని పవన్ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.ఆల్రెడీ తాడేపల్లిగూడెం సభలో నిర్వహించిన "జేండా" సభ పార్టీకి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది.ఇదే సమయంలో ఎన్నికలకు ప్రచార కార్యకలాపాల కార్యక్రమాలను వేగవంతం చేయడం జరిగింది.

Advertisement

దీనిలో భాగంగా రానున్న ఎన్నికల కోసం జనసేన పార్టీ కొత్త పాటను విడుదల చేసింది.జన జన జన జనసేన అంటూ సాగే ఈ పాటను సాన ప్రసాద్ రచించగా.

కరీముల్లా పాడారు.జోస్య భట్ల మ్యూజిక్ అందించిన ఈ పాటను జనసేన ప్రచార విభాగం బన్నీ వాస్ ఆధ్వర్యంలో రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు