బీజేపీ తో పొత్తును జనాలు, జన సైనికులు ఒప్పుకోవడం లేదా ? 

జనసేన బీజేపీ పొత్తు పెటాకులు అయ్యేలా  కనిపిస్తున్నాయి.2019 ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.

కొంతకాలం పాటు రెండు పార్టీలు సఖ్యతగా మెలిగినా ఆ తర్వాత ఎవరికి వారే అన్నట్లుగా విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

ఒక పార్టీతో మరొక పార్టీకి సంబంధం లేదన్నట్లు వ్యహరిస్తున్నారు.విడివిడిగా ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు, పర్యటనలు, సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ఉండడంతో, పేరుకే పొత్తు తప్ప, రెండు పార్టీల మధ్య సఖ్యత లేదని అందరికీ అర్థం అయిపోయింది.

అయినా జనసేన, బీజేపీలు పొత్తు కొనసాగిస్తూనే ఉన్నాయి.కేంద్ర బిజెపి పెద్దలు సైతం పవన్ కు సరిగ్గా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ లో పర్యటించినా పవన్ కు ఆ పార్టీ నాయకులకు ఆహ్వానం అందించకపోవడం ఇలా ఎన్నో కారణాలతో బీజేపీ తీరుపై జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

అంతే కాకుండా బీజేపీతో పొత్తు కారణంగా జనసేన తీవ్రంగా నష్టపోతుందని, మైనారిటీ వర్గాలు జనసేన పార్టీ కి దూరం అవుతున్నాయని  ఇప్పుడు జనసేన కీలక నాయకులు గొంతు పెంచుతున్నారు.ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన కు కొత్తగా చేకూరిన లాభం ఏమీ లేదని, కానీ బీజేపీకి జనసేన కారణంగా మైలేజ్ పెరిగిందని లెక్కలను తెరపైకి తీసుకువస్తున్నారు.

Advertisement

ఒకవేళ బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా జనసేన ను నామమాత్రం చేస్తారని, ప్రధాన పాత్ర బీజేపీ వహిస్తుందని జనసైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.జేపీ నడ్డా రాజమండ్రి గోదావరి గర్జన సభలో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రెండు పార్టీల తరఫున ప్రకటించాలని జనసేన డిమాండ్ చేసినా, బిజెపి పట్టించుకోకపోవడం , ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించే సాంప్రదాయం బీజేపీలో లేదని చెప్పడం పై జనసేన నాయకులు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన కీలక నాయకుడు.ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ సైతం ఈ అంశంపై స్పందించారు.బీజేపీతో జనసేన పొత్తు ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీతో పొత్తు కారణంగా జనసేన కు తీవ్ర నష్టం జరిగిందని, ఎన్నికల ప్రచారం లో ఎక్కడికి వెళ్ళినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు బీజేపీతో పొత్తు వల్ల జనసేన పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాదు మొదటి నుంచి బిజెపి నాయకులు ఎవరు జనసేన ను కలుపు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని ఆయన విమర్శించారు.

ఇక మరో నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యవహారంపై స్పందించారు.బీజేపీతో పొత్తు వల్ల జనసేన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ఏ ను ప్రకటించకపోవడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాబు ను వారు నమ్మడం లేదనేగా జగన్ ధీమా ? 
వైసీపీ నాయకులపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన పార్టీ రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలోనూ బీజేపీ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు