వైసీపీలో ఆ మంత్రులే టార్గెట్‌గా జనసేన భారీ వ్యూహం..?

జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.అందుకోసం ఏకంగా కాపు సమాజిక వర్గానికి చెందిన మంత్రులను టార్గెట్ చేసేందుకు సిద్ధమైంది.

జనసేన కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.రాబోయే ఎన్నికల్లో కాపు మంత్రులకు తప్పకుండా బుద్ది చెబుతామని మండిపడుతున్నారు.

గత ఎన్నికల్లో తాము కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులం అని చెబితేనే వారికి ఓట్లు వేసామని.కానీ ఎన్నికల్లో గెలిచాక తన అభిమాన నటుడినే ఇష్టానుసారంగా మాటలు అనడం ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చడం లేదంట.

దీంతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా కాపు నేతలకు చుక్కలు చూపించాలని జనసేన అభిమానులు,కార్యకర్తలు ఫిక్స్ అయ్యారని టాక్.అధికార పార్టీ వైసీపీలో పవన్ కళ్యాణ్‌ను విమర్శించేందుకు ప్రత్యేకంగా ఒక బృందం ఉందని జనసేన పార్టీ నేతలు అంటున్నారు.

Advertisement
Jana Sena Big Strategy Is To Target Those Ministers In YCP Details, YCP, Jana Se

వీరిలో గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, కురసాల కన్నబాబు వంటి కాపు నేతలు కేవలం పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు.తనను తిట్టించాలంటే కాపు నేతలను మాత్రమే ఉపయోగించుకోవడం ఎందుకని పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే.

కాపు వర్గం అంతా పవన్ వైపే.

Jana Sena Big Strategy Is To Target Those Ministers In Ycp Details, Ycp, Jana Se

ఈ నేపథ్యంలో పదేపదే పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న మంత్రులను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనిచ్చేది లేదని జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు.ముఖ్యంగా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌లకు వచ్చే ఎన్నికల్లో ఓటమిని రుచి చూపిస్తామని అంటున్నారు.

Jana Sena Big Strategy Is To Target Those Ministers In Ycp Details, Ycp, Jana Se

దీంతో పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో వాళ్లకు తెలిసి రావాలని ఫ్యాన్స్ సీరియస్‌గా ఉన్నారు.అలాగే గుడివాడలో కొడాలి నాని కూడా స్థాయిని మించి పవన్‌పై విమర్శలు చేస్తుండటంతో ఆయన్ను కూడా జనసేన పార్టీ నాయకులు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.గత ఎన్నికల్లో వీరంతా తమను ఉపయోగించుకోవడానికి ఎలాంటి సమావేశాలు పెట్టారో తాము కూడా అలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి వీరి వ్యవహారాన్ని అభిమానులు, ప్రజల ముందు ఎండగడతామని అంటున్నారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు