కూతురు ఫారెనర్ ని పెళ్లి చేసుకుంటా అంటే జగపతి బాబు ఏమన్నాడో తెలుసా?

జగపతిబాబు.టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

తన చక్కటి నటనతో మంచి జనాదరణ పొందాడు.

ప్రస్తుతం ఆయన విలన్ పాత్రలు పోషిస్తూ.

మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.ఇంకా చెప్పాలంటే.

హీరోగా కన్నా.విలన్ గానే అద్భుతంగా రాణిస్తున్నాడు కూడా.

Advertisement

సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.కుమార్తె వివాహం విషయానికి సంబంధించి పలు వార్తలు వెల్లువెత్తాయి.జగపతి బాబు పెద్దమ్మాయి మేఘన.

.బోవెన్ అనే అమెరిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఈ వివాహానికి అసలు జగపతిబాబు ఎలా ఒప్పుకున్నాడు.

ఆయన ఒకే అంటే ఎంతో మంది పెద్ద పెద్ద ఫ్యామిలీలు సంబంధం కలుపుకునేందుకు ఓకే చెప్పేవారు కదా.అని చాలా మాటలు వినిపించాయి.కానీ ఆ మాటలను తను ఏమీ పట్టించుకోలేదు.

మేఘన అమెరికాలో పీజీ చదువుతున్న సమయంలోనే బోవెన్ తో ప్రేమలో పడింది.ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఆమె చెప్పిన మాటలు విని కుటుంబ సభ్యులు అంతగా ఆశ్చర్యపోలేదు.అయితే జగపతిబాబు ఓ మాట చెప్పాడు తన కూతురుకు.20 సంవత్సరాల తర్వాత కూడా బాగుంటుంది అనుకుంటే ప్రొసీడ్ కావొచ్చు అని చెప్పాడు.తండ్రి మాటలు తనకు చాలా నచ్చాయి.

Advertisement

తన ప్రేమను గట్టిగా నమ్మింది మేఘన.కచ్చితంగా మీరు చెప్పినట్లే ఉంటామని చెప్పింది.

జగపతిబాబు ఓకే చెప్పాడు.హైదరాబాద్ లోనే వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

ఈ పెళ్లి బోవెన్ తరఫున వారి తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు.జగపతిబాబు.

తన బంధువుల్ని, మిత్రుల్ని కలిపి ఓ 200 మందిని పిలిచాడు.

ఈ పెళ్లి వేడుకను.తన ఫ్యామిలీ వేడుకలాగే నిర్వహించాడు.వచ్చిన అతిథులు ఈ పెళ్లి జరిగిన తీరుపట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ప్రేమ రెండు దేశాలను కలిపిందనన్నారు.వాస్తవానికి మేఘనకు వాళ్ల బంధువుల నుంచి సంబంధాలు వచ్చాయి.అయితే కట్నకానుకలు కావాలని అడిగారు.

నిజానికి ఆయనకు ఈ కట్నకానుకలు అంటే చెడ్డ చిరాకు.అదే బోనెన్ తల్లిదండ్రులు ఈ కట్నకానుకల మాట ఎత్తలేదు.

జగపతిబాబు ఏం కావాలో చెప్పండి అని అడిగినా వారు వద్దని చెప్పారు.అమ్మాయిని ఇస్తే చాలని చెప్పారు.

అందుకే ఈ పెళ్లికి ఓకే చెప్పాడు జగపతి బాబు.

తాజా వార్తలు