మరోసారి లోకేశ్ భద్రత కుదించిన జగన్ సర్కార్,మండిపడుతున్న నేతలు

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ భద్రతను ఏపీ జగన్ సర్కార్ మరోసారి కుదించింది.దీనితో జగన్ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఉద్దేశ్యపూర్వకంగానే లోకేశ్ భద్రతను కుదించారని, గత 8 నెలల్లో ఇలా లోకేశ్ భద్రతను కుదించడం ఇది రెండో సారి అంటూ వారు నిప్పులు చెరుగుతున్నారు.గతంలో లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించేవారు.

తర్వాత దాన్ని వై కేటగిరికి, ఇప్పుడు ఎక్స్ కేటగిరీకి మార్చారు.అమరావతి పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా ఆందోళనలు చేయడంతోపాటు.శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా లోకేశ్ వ్యవహరిస్తుండడం,ఇటీవలే సాక్షి పత్రికపై లోకేశ్ రూ.75 కోట్ల పరువునష్టం దావా వేయడం ఈ అంశాలు అన్ని చోటుచేసుకుంటున్న తరుణంలో ఆయన భద్రత ను మరోసారి ఇలా కుదించడం తో ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.2016లో ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని.

లోకేశ్ లక్ష్యంగా దాడులు చేస్తామని మావోయిస్టులు ప్రకటించారు.దీంతో ప్రభుత్వం లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది.

Advertisement

జూన్ 25 నుంచి రెండుసార్లు లోకేశ్ భద్రత తగ్గింపు పట్ల టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

2014కు ముందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2+2 భద్రత కల్పించింది.టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక లోకేశ్ భద్రతను 4+4కి పెంచారు.అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయిన తర్వాత గతంలో నారా లోకేష్ భద్రతను జడ్ కేటగిరీ నుంచి వై ప్లస్‌కు కుదించింది ప్రభుత్వం.

తాజాగా వై ప్లస్ కేటగిరీ నుంచి ఎక్స్ కేటగిరీకి మార్చడం తో టీడీపీ నేతలు మండిపడుతున్నారు.మరి దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు