వైసీపీ ప్రభుత్వంపై ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోనట్టుగానే వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నాడు.పార్టీ పరంగా అయినా, ప్రభుత్వ పరంగా అయినా వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ తన మంత్రులను, పార్టీ నాయకులను ఉపయోగిస్తున్నదే తప్ప ఎక్కడా ఓపెన్ అయ్యేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.
జగన్ తీరు ఇంతే కదా అని చాలామంది సరిపెట్టేసుకుంటున్నారు.అయితే జగన్ మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు.

ఇక చంద్రబాబు మాత్రం జగన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.టీడీపీ ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను జగన్ కావాలనే పక్కన పెట్టేసాడని, ఏపీలో అభివృద్ధి కుంటిపడిందని, ప్రభుత్వం తమ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఇలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.అయినా జగన్ నుంచి ఏ రియాక్షన్ లేదు.తనకు ప్రజల మద్దతు ఉంటే చాలు ఇంకేమి అక్కర్లేదు అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నాడు.

ముఖ్యంగా టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన తప్పులు కారణంగానే పార్టీ ఇంత దారుణ పరాజయం పొందిందని, ముఖ్యంగా పార్టీ నాయకులు అవినీతి వ్యవహారాల్లో పీకల్లోతు కూరుకుపోయిన బాబు వారిని కట్టడి చేయలేకపోయారని, ఫలితంగా టీడీపీ నాయకులంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించి తీవ్రమైన అవినీతి వ్యవహారాల్లో కూరుకుపోయారని జగన్ భావిస్తున్నాడు.అందుకే బాబు చేసిన తప్పు తాను చేయకూడదు అనే ఉద్దేశంతోనే అవినీతి విషయంలో పార్టీ నాయకులు ఎవరూ తలదూర్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఏ ప్రభుత్వానికైనా కొత్తగా ఏర్పాటయిన తర్వాత కొన్ని ప్రాధాన్యతలుంటాయి.తమ పార్టీ మ్యానిఫేస్టో, తాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని చూస్తారు.గత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకే ఈ స్థితికి వచ్చింది అన్నది బహిరంగ రహస్యం.రైతు రుణమాఫీ, డ్వాక్రారుణాల రద్దు వంటి హామీలను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయలేక ప్రజల్లో దోషిగా టీడీపీ నిలబడింది.

అందుకే జగన్ అటువంటి తప్పులు చేయకుండా తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలు, వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టో అమలుకు ముందుగా ప్రాధాన్యం ఇస్తున్నాడు.అరిధికంగా భారం అయినా వాటిని అమలు చేస్తున్నాడు.ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీఎంబర్స్ మెంట్, రైతు భరోసా వంటి కార్యక్రమాలను ఇప్పటికే అమలు చేసేలా జగన్ చర్యలు తీసుకున్నారు.చంద్రబాబు లాగా తాను ప్రజల్లో నమ్మకం కోల్పోకూడదనే జగన్ తొలి ఏడాదే హామీల అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతోంది.
ఇక ఇదే సమయంలో పార్టీని కూడా జగన్ క్రమశిక్షణలో పెట్టగలుగుతున్నాడు.చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోలేదు.కానీ జగన్ మాత్రం ఇటు పార్టీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పార్టీలో చేరికలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జిల నియామకంతో పాటు నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తూ పార్టీలో అసంతృప్తి తలెత్తకుండా ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుని మరీ ముందుకు వెళ్తున్నాడు.