ఏపీలో మంత్రివర్గ పునర్వ్యస్ధీకరణ అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు రేపుతోంది.మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్న వారికి అధిష్టానం మొండిచేయి ఇవ్వడంతో పలువురు నేతలు తీవ్ర నిరాశ చెందారు.
నూతన మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సీఎం ఆదేశించడంతో సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని నివాసానికి వెళ్లి బుజ్జగించారు.
మరో వైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు 30 మంది కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు.
కష్టకాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీకి అండగా వున్నారని.వెనకబడ్డ పల్నాడు ప్రాంతానికి మంత్రి పదవి కేటాయిస్తే అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.
నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవీ ఎక్స్ పెక్ట్ చేశారు.
అయితే తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు.దీంతో అతని అభిమానులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పదవీ కోసం తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మంత్రి పదవీ ఎందుకు ఇవ్వలేదో కనీసం చెప్పే వారు కూడా లేరని మండిపడుతున్నారు.వైసీపీలో ముందు నుంచి తనకు ప్రాధాన్యతలేదని కోటంరెట్టి అసహనం వ్యక్తం చేశారు.
సామినేని ఉదయభానుకి కూడా మంత్రి పదవి ఆశించారు.
కానీ మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తి చెందారు.దాంతో జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్స్ రాజీనామాకు సిద్ధమయ్యారు.
సీనియర్ నేత అయిన సామినేని ఉదయభానుకి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఉదయభాను అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.