అధిష్టానమే సీఎం ఎవరనేది నిర్ణయిస్తుంది..: ఉత్తమ్

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ భేటీ ముగిసింది.

సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ అధిష్టానమే తెలంగాణ ముఖ్యమంత్రిని నిర్ణయిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా ఏకగ్రీవ తీర్మానం చేసి పార్టీ హైకమాండ్ కు పంపామని చెప్పారు.

ఎవరు సీఎం అవుతారనేది తాను చెప్పలేనని పేర్కొన్నారు.అయితే ఢిల్లీలోనే ఉన్న కాసేపటి క్రితమే డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు