చిన్న వయసులోనే నిరుపేద యువకుడికి పెద్ద కష్టం...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన లంజపల్లి ఉదయ్ అనే యువకుడికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చింది.

గత కొంత కాలంగా అతడు లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్, కడుపులో నీరుతో బాధపడుతూ హైదరాబాద్ ఆస్పత్రిలో ప్రాణాప్రాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

అసలే రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం, దానికి తోడు తండ్రి లేడు, పేదతల్లి కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.కన్న కొడుకు పడుతున్న బాధ చూసి ఆ ఒంటరి పేద తల్లి తల్లడిల్లుతోంది.

It Is A Big Hardship For A Poor Youth At An Early Age, Suryapet, Munagala, Lanja

వైద్య ఖర్చులకు డబ్బులులేక దాతల సహాయం కోసం ఎదురుచూస్తుంది.ఈ పేద కుటుంబానికి ఎవరైనా దాతలు సహాయం చేసి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తన కొడుకు పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం చేసే వారు 6305459002 నెంబర్ కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని తల్లి రమణ వేడుకుంటుంది.

Advertisement
నోటి దుర్వాసనను దూరం చేసే 5 నేచురల్ మౌత్ ఫ్రెష్ నర్లు.. మీరూ ట్రై చేయండి!

Latest Suryapet News