ఆ విష‌యంలో బాబునే ఫాలో అవుతోన్న జ‌గ‌న్‌.. అక్క‌డే దెబ్బ ప‌డిందిగా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.వైసీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌కు ఏమైనా తేడా ఉందా ?  అంటే.

చాలా విష‌యాల్లో తేడా ఉంది.

పార్టీని న‌డిపించే విధానం నుంచి ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకునే నిర్ణ‌యాల వ‌ర‌కు కూడా ఇద్ద‌రు నాయ‌కులు ఎవ‌రి శైలిలో వారు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే.గ‌తంలో చంద్ర‌బాబు భిన్న‌మైన శైలిని అవలంబిస్తే.

ప్ర‌స్తుత జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పాలిస్తున్నారు.అయితే, వీరిద్ద‌రి మ‌ధ్య ఒకే త‌ర‌హా రాజ‌కీయం ఏదైనా ఉందా? అంటే.ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఒకే ఒక్క విష‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య సారూప్య‌త ఉంద‌ని చెబుతున్నారు.అదే.రాజ‌కీయంగా నాయ‌కుల‌కు, అధికారికంగా అధికారుల‌కు ప్రాధాన్యం ఇచ్చే విష‌యంలో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఒక్క‌టే అనే మాట వినిపిస్తోంది.

Advertisement

చంద్ర‌బాబు త‌న హ‌యాంలో సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టి.ప‌క్క‌పార్టీల నుంచి వ‌చ్చిన వారికి పెద్ద పీట వేశారు.అదే స‌మ‌యంలో అధికారుల‌ను కూడా త‌న‌కున‌చ్చిన వారిని నియమించుకుని ప్ర‌ధాన బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

మంత్రి ప‌ద‌వుల నుంచి పార్టీలోనూ కీల‌క‌మైన విష‌యాలు కూడా చంద్ర‌బాబు కొత్త‌వారికి అప్ప‌గించారు.ఇది సీనియ‌ర్ల‌కు ఆగ్ర‌హం తెప్పించింది.

అయిన‌ప్ప‌టికీ.ఆయ‌న వెర‌వ‌కుండా ముందుకుసాగారు.

ఫ‌లితంగా సీనియ‌ర్లు త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించారు.అప్ప‌టి వ‌ర‌కు పార్టీని జాగ్ర‌త్త‌గా చూసుకున్న ధూళిపాళ్ల న‌రేంద్ర‌, బుచ్చ‌య్య చౌద‌రి, క‌ర‌ణం బ‌ల‌రాం వంటివారు పార్టీపై అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అధికారులు కూడా చంద్ర‌బాబు ఇచ్చిన చ‌నువుతో టీడీపీ ఎమ్మెల్యేల‌ను సైతం లెక్క‌చేయ‌ని ప‌రిస్తితి వ‌చ్చింది.ఇప్పుడు సేమ్ టు సేమ్‌.

Advertisement

ఇలాంటి ప‌రిస్థితే.వైసీపీలోనూ జ‌రుగుతోంది.

పాత‌వారిని, పార్టీ జెండాలు మోసిన వారిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు.గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరిన వారికి.

ఇటీవ‌ల పార్టీ తీర్థం పుచ్చుకున్న వారికి ప‌గ్గాలు దాదాపుగా అప్ప‌గించేశారు.

అదే స‌మ‌యంలో అధికారుల‌ను కూడా త‌నకు న‌చ్చిన వారినే నియ‌మించుకున్నారు.ఫ‌లితంగా ఇది పార్టీపైనా.ప్ర‌భుత్వ న‌డ‌క‌పైనా ప్ర‌భావం చూపిస్తోంది.

ఎక్క‌డా కూడా ఎమ్మెల్యేల‌ను మంత్రులు లెక్క‌చేయ‌డం లేదు.పార్టీలోనూ అసంతృప్తి జ్వాల‌లు పెల్లుబుకుతున్నా.

జ‌గ‌న్ మౌనంగా ఉంటున్నారు.దీంతో ఎక్క‌డిక‌క్క‌డ పార్టీలో లోపాయికారీ వ్య‌వ‌హారాలు వెలుగు చూస్తున్నాయి.

మ‌రి చంద్ర‌బాబు లాగా జ‌గ‌న్ మారితే.ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

తాజా వార్తలు