ఇదేందయ్యా ఇది.. స్వర్గంలో మీటర్ స్థలం రూ.8,000... కొనుక్కోడానికి ఎగబడుతున్న జనం..?

ప్రస్తుతం మెక్సికో( Mexico )లోని ఇగ్లెసియా డెల్ ఫైనల్ డి లోస్ టీంపోస్ అనే చర్చి ఒక విచిత్రమైన ఆఫర్‌తో ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ చర్చి స్వర్గంలో భూమి అమ్ముతోంది! ఈ చర్చి పాస్టర్ దేవుడితో 2017లో ఒక వ్యక్తిగత సమావేశంలో ఈ విషయానికి దైవ ఆమోదం పొందాడట.

చదరపు మీటర్‌కు 100 డాలర్లు (రూ.8,336) చొప్పున నమ్మకస్థులు స్వర్గంలో భూమిని కొనుగోలు చేయవచ్చని, దేవుడి రాజభవనానికి దగ్గరగా ఉన్న ప్రధాన ప్రాంతాలను కూడా అందిస్తామని హామీ ఇస్తున్నాడు.

చర్చి వివిధ రకాల చెల్లింపు పద్ధతులను అంగీకరిస్తుంది, వీటిలో పేపాల్ , గూగుల్ పే , వీసా, మాస్టర్‌కార్డ్ , అమెరికన్ ఎక్స్‌ప్రెస్ తో పాటు సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు కూడా ఉన్నాయి.ఈ ఆఫర్‌ను ప్రోత్సహించడానికి, మేఘాలలో ఉన్న ఒక విలాసవంతమైన భవనం ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ భవనం చుట్టూ బంగారు కిరణాలు, సంతోషంగా ఉన్న ఒక కుటుంబం ఉన్నాయి.

ఈ చర్చి ఆఫర్ సోషల్ మీడియా(Social media )లో చాలా చర్చనీయాంశమైంది.కొందరు దీనిని ఎగతాళి చేస్తూ, దీనిని దోపిడీ అని విమర్శిస్తున్నారు.

మరోవైపు, కొంతమంది నమ్మకస్థులు ఈ ఆఫర్‌ను సీరియస్ గా పరిగణిస్తున్నారు.ఆ వీడియోలో ఆకాశ మందిరం ఉంది.

Advertisement

కానీ, చాలా మందికి ఆ వీడియో నిజంగా ప్రకటన అనుకున్నారు.కానీ నిజానికి అది కామెడీ వీడియో.

సరదాగా కంటెంట్ పెట్టే ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియో 1 లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇదంతా ఫన్నీ వీడియో అని తెలిసినా, ఒక వ్యక్తి స్వర్గంలో స్థలం కోసం రుణాలు తీసుకోవాలేమో అని వ్యాఖ్యానించాడు.మరొకరు దీన్ని "ఈ శతాబ్దపు కమెంట్" అన్నారు.కొందరు దీన్ని "అతి పెద్ద రియల్ ఎస్టేట్ మోసం" అని భావించారు.

కొంతమంది డౌన్ పేమెంట్ ఇవ్వచ్చా అని హాస్యంగా అడిగారు.మరికొందరు నకిలీ బాబాలను విమర్శించారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

మత నాయకులు డబ్బు సంపాదించడానికి వివాదాస్పదమైన పథకాలను వాడడం ఇదే మొదటి కాదు.అమెరికాలో, పాస్టర్ ఎలిజియో రెగాలాడో, అతని భార్య కైట్లిన్ న్యాయ సమస్యలను ఎదుర్కొన్నారు.వారు దేవుని ఆదేశం మేరకు పనికిరాని క్రిప్టోకరెన్సీని అమ్ముతున్నట్లు చెప్పి 300 మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి 3.2 మిలియన్ డాలర్లు వసూలు చేశారు.వారు ఆ డబ్బును ఖరీదైన జీవితానికి ఖర్చు చేశారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు