అవార్డు అనేది నటనకు లేదా ఒక ఉత్తమ ప్రదర్శనకు కోలమానంగా భావిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ దానికి ఒక విలువ ఉంది.చాలామంది అవార్డులు పరిచయాలతో వస్తాయి లాలూచీలతో వస్తాయి అని అనుకుంటారు అందుకే పట్టించుకోవడం కూడా మానేసిన నటీనటులు ఉన్నారు.
ఆఖరికి ఆస్కార్( Oscar ) కూడా పైరవీ ద్వారానే వచ్చింది అని చాలామంది నమ్ముతున్నారు.డబ్బు ఖర్చు చేస్తే చాలు ఈ ప్రపంచంలో కొనలేని అవార్డు అంటూ లేదు కానీ కొన్నిసార్లు ఎంతో బాగా నటించి జీవించిన కొంతమంది నటీనటులకు ఆ అవార్డు రాకపోతే వారికే కాదు వారిని అభిమానించే ప్రేక్షకులు కూడా డిసప్పాయింట్ అయిన సందర్భాలు ఉంటాయి.
సరైన అర్హతకు పట్టం కట్టకపోతే ఏం జరుగుతుంది అనే విషయం ఈ నటీనటులను చూస్తే అర్థమవుతుంది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన సిద్ధార్థ్ కి( Siddharth ) ఖచ్చితంగా మంచి నటుడు … అలాగే అవార్డుకు అర్హుడు.ఈ సినిమా ద్వారా అతనికి నంది అవార్డు( Nandi Award ) వస్తుంది అని అతను ఎంతగానో ఆశించాడు.అతడు మాత్రమే కాదు ఆయన అభిమానులు కూడా కోరుకున్నారు.
కానీ ఆయనకు ఆ అవార్డు దక్కలేదు.ఇక శ్యాం సింగరాయ్, లవ్ స్టోరీ సినిమాలలో ఎంతో అద్భుతంగా నటించినా సాయి పల్లవి( Sai Pallavi ) వంటి నటికి ఆ యేడు సైమా అవార్డు( SIIMA Award ) దక్కుతుంది అని అందరూ అనుకున్నారు.
కానీ తీరా చూస్తే పూజ హెగ్డే( Pooja Hegde ) సదరు అవార్డు అందుకుంది.దాంతో సాయి పల్లవి ఫ్యాన్స్ బహిరంగం గానే తమ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్( Ram Charan ) నటన మరో రేంజ్ లో ఉంటుంది.అప్పటి వరకు ఆయనను కొంత వరకు ట్రోల్ చేసిన వారు కూడా ఆ సినిమా లో చరణ్ నటన చూసి ముక్కున వేలేసుకున్నారు.
ఇక ఆయనకు ఆయన ఆ ఏడాది నేషనల్ అవార్డు వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఒక బాలీవుడ్ యాక్టర్ కి అది దక్కింది.దాంతో రాంచరణ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు.